Battle of Buxar

యుద్ధం జరిగిన స్థలం:
Battle of Buxar 1764 లో అక్టోబర్ 22న జరిగిన, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆధిపత్యాన్ని పెంచుకునటున్న సమయంలో ఒకవైపు బెంగాల్ నవాబు, మీరు ఖాసీం (Qasim). అవాద్ నవాబు షుజ-ఉద్-దౌలా (Shuja-ud-Daulah), మొగల్ చక్రవర్తి షా అల్లం-Ⅱ ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ వారిని దెబ్బ కొట్టాలి అని గంగానది తిరణ, బక్సార్ (Buxar) అనే ప్రదేశంలో రక్తంతో ఎర్ర పడింది. బీహార్ రాష్ట్రంలో ఉంది.
ఈ యుద్ధం జరగకపోయి ఉంటే భారతదేశ చరిత్ర మరో రకంగా ఉండేది. బక్సార్ (Buxar) యుద్ధం కంటే ముందు భారతదేశ చరిత్రను మార్చిన యుద్ధం జరిగింది ఎన్నో కుట్రలతో, మోసాలతో ఆ యుద్ధం జరిగింది.
ప్లాసీ యుద్ధం:
మొగల్ సామ్రాజ్యం నుంచి, బెంగాల్ ప్రాంతం నుంచి, స్వతంత్రంగా ప్రకటించుకున్న తర్వాత భారతదేశంలో చాలా మార్పులు జరిగాయి. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు యూరోప్ దేశాల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వ్యాపారం కోసం మన దేశం వచ్చారు. వారికి మొదటిలో మన దేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి రాకపోయినా, తర్వాత మొగల్ పాలకుల నుంచి అనుమతి తీసుకుని భారతదేశంలో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొగల్ చక్రవర్తి అయిన జంగిర్ (Jahangir) నుంచి వ్యాపారం చేయడానికి అనుమతి తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మంచి లాభాలు పొందారు. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారత దేశంలో వ్యాపారం చేస్తుంది కాబట్టి మొగల్ సామ్రాజ్యానికి సిస్తు కట్టాల్సి వస్తుంది. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాలు చేస్తూ ఎక్కువగా సిస్తు కట్టేవారు.
తర్వాత మొగల్ చక్రవర్తి అయినా ఫరూక్సియర్ (Faruksiyar) బ్రిటిస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిస్తు కట్టకుండా వ్యాపారం చూసుకోమని చెప్తాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిస్తు కట్టకుండా వ్యాపారం చేయడం మొదలుపెడతారు.
అలా కొంతకాలానికి మొగల్ సామ్రాజ్యం క్షినిస్తూ వస్తుంది మొగల్ సామ్రాజ్యం కింద ఉన్న సామంతులు వారి స్వతంత్రాన్ని పాటించుకొని సొంతగా పరిపాలిస్తారు. అప్పుడు ముర్శిద్ క్యలి ఖాన్ (Murshid Quli Khan) నవాబు కూడా బెంగాల్ ప్రాంతాన్ని స్వొంతంగ పాలిస్తాడు.
ఈ బెంగాల్ రాజ్యాని ముర్శిద్ క్యలి ఖాన్ (Murshid Quli Khan) తర్వాత చాలామంది నవాబులు పరిపాలించారు బెంగాల్ ప్రాంతానికి చివరిగా సిరాజ్-ఉద్-దౌలా (Siraj ud Daulah) పరిపాలించాడు. ఒక తెలివైన నవాబు కానీ సిరాజ్-ఉద్-దౌలాని మోసం చేసి వెన్నుపోటు పొడుస్తారు. వారె బ్రిటిష్ ఈస్ట్ ఇండియ కంపెనీకి ఉన్న రాబర్ట్ క్లైవ్ (Robert Clive) మరియు సిరాజ్-ఉద్-దౌలాకి నమ్మకస్తులుగా ఉన్నవారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియ కంపెనీకి మొదట్లో సిరాజ్-ఉద్-దౌలాకి (Siraj ud Daulah) చిన్న యుద్దాలు జరిగేవి చివరికి వారందరికీ ఒక్క ఒప్పందం కుదురుతుంది. కానీ బ్రిటిష్ అధికారి అయిన రాబర్ట్ క్లైవ్ (Robert Clive) మాత్రం సిరాజ్-ఉద్-దౌలాను వెన్ను పోటు పొడిచి బెంగాల్ ప్రాంతన్ని తన గుపిట్లో ఉంచ్చుకోవాలి అని ఈ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఎందుకంటే సిరాజ్-ఉద్-దౌలాతో యుద్ధం చేస్తే ఓడిపోతం అని తెలుసు అందుకని తెలివిగా సిరాజ్-ఉద్-దౌలాతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.
సిరాజ్-ఉద్-దౌలా, రాబర్ట్ క్లైవ్ తో (Robert Clive) ఒప్పందం కుదుర్చుకుంటాడు. కాబట్టి అతన్ని నమ్మే వాడు కానీ రాబర్ట్ క్లైవ్ మాత్రం ఎలా అయినా ఓడించాలని చూస్తాడు. అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఒక పదకం వేస్తాడు సిరాజ్-ఉద్-దౌలా దగ్గర ఉన్న అధికారాలను తన వైపుకు తిప్పుకుంటాడు.
సిరాజ్-ఉద్-దౌలాతో ఉన్న అధికారులకు డబ్బు, పదవి ఆశ చూపించి తమ వైపుకు తప్పుకుంటాడు. వారు కూడా డబ్బు, పదవి ఆశతో చేతులు కలుపుతారు వారిలో సిరాజ్-ఉద్-దౌలా సైనికుడు అయిన మిర్జఫార్ (Mirjafar) ఒకడు.
మిర్జఫార్ తో, రాబర్ట్ క్లైవ్ తనతో చేతులు కలిపితే నవాబును చేస్తాను అంటాడు. పదవి ఆశ పడ్డ మిర్జఫార్ రాబర్ట్ క్లైవ్ తో చేతులు కలుపుతాడు. అల సిరాజ్-ఉద్-దౌలాకి తెలియకుండా బెంగాల్లో ఉన్న అధికారులను కూడా తన వైపు తిప్పుకుంటాడు.
సిరాజ్-ఉద్-దౌలా తన రాజ్యాన్ని బలంగా మార్చుకోవడానికి ఆలోచిస్తుంటే రాబర్ట్ క్లైవ్ మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూసేవాడు. ఆ సమయం రాగానే రాబర్ట్ క్లైవ్ హద్దులు దాటటం వల్ల సిరాజ్-ఉద్-దౌలా ఒక యుద్ధం చేసాడు అదే ప్లాసీ యుద్ధం.
ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది ఆ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ మిర్జఫార్ సహాయంతో సిరాజ్-ఉద్-దౌలాని చంపేస్తాడు. రాబర్ట్ క్లైవ్ తన మంత్రులతో వెన్నుపోటు పొడిచి చంపినా తరువాత బెంగాల్ రాబర్ట్ క్లైవ్ చేతిలోకి వస్తుంది.
ప్లాసీ యుద్ధం తరవాత పరిస్తితి:
1757లో జరిగిన ప్లాసీ యుద్ధం తరువాత బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం వేగంగా పెరిగింది. ఆ యుద్ధం ఫలితంగా రాబర్ట్ క్లైవ్, మిర్జఫార్ కి ఇచ్చిన మాట ప్రకారం బెంగాల్ కు నవాబుని చేస్తాడు. మిర్జఫార్ బెంగాల్ కి నవాబుగా ఉంటూ, రాబర్ట్ క్లైవ్ చెప్పిన పనులు చేసేవాడు. మిర్జఫార్ బెంగాల్ కి నవాబుగా ఉన్న ఎం చెయ్యాలి ఎం చెయ్యకోదదో నిర్ణయించేది మాత్రం బ్రిటిష్ ఈస్టి ఇండియ కంపెనీ గవర్నర్ అయిన రాబర్ట్ క్లైవ్.
బెంగాల్ ప్రాంతం గొప్ప ప్రాంతం అలంటి ప్రాంతన్ని ఇస్తే నువ్వు ఇచ్చేది ఇదేనా నువ్వు ప్రజలదగ్గర నుంచి ఇంక్క పన్ను వాసులు చేసి మాకు ఇవ్వమని రాబర్ట్ క్లైవ్, మిర్జఫార్ కి చెప్తాడు.
అదే సమయంలో డచ్ ఈస్టి ఇండియ కంపెనీ వ్యాపారంలో ఒక్క స్థాయికి ఎదుగుతుంది. అప్పుడు డచ్ ఈస్ట్ ఇండియ కంపెనీకి మిర్జఫార్ కి స్నేహపూర్వక సంబంధం పెరుగుతుంది.
మిర్జఫార్ మెల్లగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలుపుతాడు. ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒత్తిడి తట్టుకోలేక పోయాడు. అందుకే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి శత్రువు అయిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలుపుతాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1759 లో ఒక్క యుద్ధం జరుగుతుంది, చిన్సుర (Battle of Chinsurah) యుద్ధం. ఈ యుద్ధంలో మిర్జఫార్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుస్తుంది అనుకొని, డచ్ వారికీ సహాయం చేస్తాడు కాని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వారిని ఓడిస్తుంది. ఈ యుద్ధంలో గెలిచిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకి వ్యతిరేకంగా మారిన మిర్జఫార్ ని 1760 లో బెంగాల్ నవబుగా పదవి నుంచి తీసేస్తుంది.
మిర్జఫార్ ని బెంగాల్ నవబుగా చెయ్యటానికి ప్రదన కరణం బెంగాల్ వారి గుప్పిట్లో ఉంటుంది అని. కానీ మిర్జఫార్ బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా ఉండటం వల్ల బ్రిటిష్ వారు బెంగాల్ నవాబుగా తీసేస్తారు.
అప్పుడు మిర్జఫార్ అల్లుడు, మీర్ ఖాసిం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దగ్గరికి వెళ్లి నన్ను బెంగాల్ కి నవాబుగా చేయండి, నేను మీరు చెప్పినది చేస్తానని బారి పన్నులు చేలిస్తా అని చెప్తాడు.
అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీర్ ఖాసింకి కొన్ని షరతులు పెడతారు. వాటన్నిటికీ మీర్ ఖాసిం ఒప్పుకుంటాడు. దానితో మిర్జఫార్ అల్లుడు, మీర్ ఖాసింని బెంగాల్ కి నవాబును చేస్తారు. మీర్ ఖాసిం 1760లో బెంగాల్ కి నవాబు అవుతాడు. నవాబు అయిన తర్వాత కొన్ని రోజులకి బెంగాల్ లో ఒక కొత్త పాలన తీసుకొని వస్తాడు. ఆయన బ్రిటిష్ ఆధిపత్యాన్ని తగ్గించాలని సంకల్పించాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వస్తువులను బెంగాల్ ప్రాంతపు ప్రజలు దిగుమతి చేసుకొని వ్యాపారం చేసేవారు. అయితే దానికి ప్రజలు పన్ను చేలించేవారు అది చాలా ఎక్కువగా ఉండేది. దాని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాల లాబాలు వస్తుండేవి.
అయితే మీర్ ఖాసిం బెంగాల్లో ఉండే ప్రజలకు ఆ పన్ను చేలించాకుడనే వ్యాపారం చేసుకోమన్నడు. మీర్ ఖాసిం అలంటి పాలన తీసుకురావడం వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా నష్టం వస్తుంది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1763లో మీర్ ఖాసింని బెంగాల్ పదవి నుంచి తీసేస్తారు.
మిత్ర కూటమి:

అప్పుడు మల్లి మిర్జఫార్ ని నవాబును చేస్తారు పదవిని కోల్పోయిన మీర్ ఖాసిం బ్రిటిష్ శక్తిని ఒంటరిగా ఎదుర్కోవటం కష్టమని గ్రహించిన బెంగాల్ నుంచి అవాద్ కి (Awadh) వెల్లి, అవాద్ నవాబు అయిన షుజ-ఉద్-దౌలాని (Shuja ud daulah) కలిసి తనకు సహాయం చేయమని అడుగుతాడు. వీరిద్దరూ కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీన్ని ఓడించటానికి ఒక్కటిగా అవుతారు వీరిద్దరికీ తమ బలానిపెంచుకోవాలి అని ఆలోచన వస్తుంది.
ఇద్దరు కలిసి మొగల్ చక్రవర్తి అయిన షా ఆలం-Ⅱను కలుస్తారు. అయితే మొగల్ సామ్రాజ్యం క్షినించి ఉంది మునుపటిల బలంగా లేదు. మొగల్ సామ్రాజ్యంలో తర్వాత వచ్చిన పాలకులు చిన్నచిన్న ప్రాంతాలను చూసుకునేవారు. అయితే మీర్ ఖాసిం, షుజ-ఉద్-దౌలా, షా ఆలం-Ⅱతో విరు ముగ్గురు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం చేస్తారు అదే బక్సార్ యుద్ధం.
బక్సార్ యుద్దభూమి:
విరు ముగ్గురు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై దాడి చేయడానికి బీహార్ లో ఉన్న బక్సార్ ప్రాంతంలోకి వెళ్తారు. 1764 అక్టోబర్ 22 ఉదయం వీరికి యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ సైన్యనికి సుమారు 7,000 మాత్రమే ఉన్నారు వారి సేనాధిపతి హెక్టర్ మున్రో (Hector Munro) అనుభవజ్ఞుడు. సైన్యం క్రమశిక్షణతో, ఆధునిక ఆయుధాలతో ఉంటుంది మరోవైపు భారతీయ మిత్ర కూటమికి సుమారు 40,000 మంది సైన్యం ఉంటుంది సంక్య ఎక్కువైనప్పటికీ సమనవ్యం లోపించింది. యుద్ధం ప్రారంభమైన వెంటనే గట్టి కాల్పులు జరిగాయి. బ్రిటిష్ సైన్యం ముందుకు సాగింది మిత్ర కూటమి సైన్యంలో గందరగోళం అయిపోతుంది. కొన్ని గంటలకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై గెలుస్తుంది. బక్సార్ ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల దాన్ని బక్సార్ యుద్ధం అని పిలుస్తారు.
ఈ యుద్ధంలో మీర్ ఖాసిం అక్కడ నుండి పరిపోతాడు. షుజ-ఉద్-దౌలా, షా ఆలం-Ⅱమాత్రం దొరికిపోతారు. వారి ప్రాంతలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. ఈ యుద్ధం జరుగుతున్న సమయానికి బ్రిటిష్ గవర్నర్ అయిన రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో ఉండడు. ఇంగ్లాండ్ కి వెళ్తాడు వెల్లి వచ్చేసరికి యుద్ధం జరిగిపోతుంది.
రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి వచ్చిన తర్వాత బక్సార్ యుద్ధం నుంచి తప్పించుకున్న మీర్ ఖాసింని చంపిచేస్తాడు.
అల్లహాబాద్ ఒప్పనదం 1765
ఆ యుద్ధంలో మిగిలిన ఇద్దరితో 1765 అల్లహాబాద్ లో ఒక ఒప్పందనికి వస్తాడు, ఆ ఒప్పందం ప్రకారం షుజ-ఉద్-దౌలాకి అవాద్ ప్రాంతాన్ని ఇస్తాడు. దానికి బదులుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ప్రాంతాలను, కొంత డబ్బును షుజ-ఉద్-దౌలా ఇస్తాడు. షా ఆలం-Ⅱ కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి దివానీ (Diwani) హక్కులు వస్తాయి. అంటే పన్ను వసూలు చేసే హక్కు. బెంగాల్, ఒరిస్సా, బీహార్ దివానీ హక్కులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తాయి.
ముగింపు
బక్సార్ యుద్ధం ఒక్క చిన్న ప్రాంతంలో జరిగిన, అది భారతదేశ రాజకీయ, ఆర్దిక, సామజిక రంగాలపై గొప్ప మార్పు చూపించింది. ఈ యుద్ధం భారతదేశంలో బ్రిటష్ పాలన స్థిరపడటానికి బలమైన పునాది వేసింది.
ఈ యుద్ధం మనకు ఎం నేర్పిస్తుంది అంటే ఐక్యత, వ్యూహరచన, దూరదృష్టి లేకపోతె ఎంత పెద్ద సైన్యమున్నా విజయం సాధించలేమని.






1 thought on “Battle of Buxar in Telugu-బక్సార్ యుద్ధం 1764”