భారతదేశ చరిత్ర
ప్లాసీ యుద్ధం

Battle of Plassey
ప్లాసీ యుద్ధం బెంగాల్ లోని భాగీరధి-హుగ్లీ నది తీరాన ప్లాసీ అనే ప్రాంతంలో 1757 జూన్ 23న జరిగింది. ఇది కలకత్తాకు ఉత్తరాన 150 కిలోమీటర్లో ఉంది. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిష్ కి పాలకులుగా మారడానికి ఈ యుద్ధం మొట్టమొదటిగా ఉపయోగపడింది. ఈ యుద్ధనికి పాల్పడిన వారిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ,(సుమారు 3,000 మంది సైనికులు) బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్-దౌల (సుమారు 50,000 మంది సైనికులు) మరియు అతనికి మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ సైన్యుకుల మధ్య జరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ గా రాబార్డ్ క్లైవ్ ఉండేవాడు ఈ యుద్ధం కేవలం 40 నిమిషాలు మాత్రమే కొనసాగింది.
యుద్ధం కొనసాగిన విధానం:
1757 జూన్ 23న జరిగిన ఈ యుద్ధానికి ముందు ప్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి మూడు యుద్ధాలు జరిగినవి చివరిగా బ్రిటిష్ వారు కర్ణాటకను స్వాధీన పరుచుకున్నారు. ఈ సమయంలో బెంగాల్లో అలీవర్ధన్ ఖాన్ బెంగాల్ నవాబుగా ఉండేవాడు.
ఇతనికి ఇంగ్లాండ్ వారి ఎత్తులు, జిత్తులు అక్రమాలు అన్ని తెలుసు కనుక వారి పట్ల జాగ్రత్తగానే ఉండేవాడు. అయినా కూడా వారి కోటలను బలోపేతం చేసుకోవడానికి మారట అనే గంధకం తవ్వడానికి అనుమతిని ఇస్తాడు. దానికి ప్రతిగా పెద్ద మొత్తంలో వారి నుండి ధనాన్ని వసూలు చేస్తాడు.1756 లో అలీవర్ధన్ ఖాన్ మరణించాడు. అతని తర్వాత, అతని కూతురు కొడుకు సిరాజ్-ఉద్-దౌలా బెంగాల్ కు నవాబు అవుతాడు. అతను బాగా కోపిష్టి అని, విషయ అవగాహన తక్కువ అని, ఇతను ఆస్థానంలో చాలామందికి అతను అంటే నచ్చదు అని వ్యతిరేకిస్తారని చెప్తారు.
యురోప్ నుంచి వచ్చి కంపెనీలు పెట్టి బాగా లాభాలు సంపదిస్తున్నాడు అని, ఆ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని కోపం కూడా సిరాజ్-ఉద్-దౌలాకి ఉంటుంది.
ఈ సందర్భంలోనే ఫ్రెంచ్ వారి నుంచి రక్షించుకోవడానికి అనే, సాకుతో, బెంగాల్లోని విలియం కోటకు రక్షణగా కొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ
ఈ విధంగా తన అనుమతి లేకుండా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఆపమని ఆదేశిస్తాడు నవాబు. కానీ బ్రిటిష్ వారు అతని ఆదేశాలను పట్టించుకోరు దానితో నవాబు మూడు వేల మంది సైన్యంతో వెళ్లి (కాసిం బజార్) అనే కోటను అక్కడ కంపెనీని ఆక్రమిస్తాడు.
చాలామంది బ్రిటిష్ వారిని బందీలుగా పట్టుకుంటాడు. అలా పట్టుకున్న వారిని బ్రిటిష్ నిర్మించుకున్న విలియం కోటలోనే ఒక చిన్న గదిలో బంధిస్తారు.
మొత్తం ఖైదీలు: 146
గది సైజు: పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 4.3 మీటర్లు, ఈ చిన్న గదికి చిన్న కిటికీలు ఉండేవి దీనిలో ఆరుగురు ఖైదీలను బంధించడానికి కట్టించబడింది. ఇంత చిన్న గదిలో 146 మందినీ కుక్కి ఉంచడంతో తెల్లవారేసరికి వారిలో 23 మంది మాత్రమే ప్రాణాలతో బ్రతికి ఉన్నారు. దీనినే కలకత్తా చీకటి గది ఉదాంతం అని బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా ఊచకోత అని అంటారు.
ఆ తర్వాత నవాబు సైన్యం కలకత్తాను బ్రిటిష్ వారి కంపెనీలను దోచుకుంటుంది బెంగాల్ నవాబు చేసిన ఈ దాడులు వివరాలు చీకటి గది వివరాలు మద్రాసులోని బ్రిటిష్ ప్రెసిడెంట్ కి 1756 ఆగస్టు 16న తెలుస్తుంది. వారు వెంటనే రాబర్డ్ క్లైవ్ మరియు చార్లిస్ వాట్సన్ అనే అతనిని అడ్మిరల్ గా చేసి, తొమ్మిది వందల మంది యూరోప్ సైనికులను, 15 వేల ఇతర సైనికులను ఇచ్చి బెంగాల్ కు పంపిస్తుంది.
బెంగాల్ తరుపున సర్వ సైన్యాధ్యక్షుడుగా నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా ఉంటాడు పదవి దళానికి నాయకుడిగా వీర్ మదన్ మోహన్ లాల్ ఉంటారు.
ఇతని కింద ఐదు వేల అశ్వికదళం, ఎడు వేల కాల్బలం ఉంటుంది. మద్య బాగానికి యార్ లుతుఫ్ ఖాన్ ఉంటాడు. కుడి బాగనికి రాయ్ దుర్లబ్ ఉంటాడు. బెంగాల్ వైపున 53 శతగాములు ఉంటాయి. అంతే కాకుండా వీరికి మిత్రువులుగా ఫ్రెంచ్ ఉంటుంది. ఫ్రెంచ్ నాయకుడు సెయింట్ ప్రెస్ అనే అతను ఉంటాడు. ఇతని కింద 50 మంది సైనికులు, 6 శతగ్నులు ఉంటారు.
యుద్ధ సమయంలో నవాబు యొద్ద 30వేల కాల్బలం, 20 వేల అశ్వకదళం, 30 శతగాములు 50 మంది ఫ్రెంచ్ సైనికులు ఉంటారు.
అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోని గెలవడం కష్టమని బావించినా రాబార్డ్ క్లైవ్ తన బ్రిటిష్ జుత్తుల మారి బుద్ధుని ప్రదర్శిస్తాడు.
బెంగాల్ నవాబు ప్రధాన సైన్యాధికారి అయిన మీర్ జాఫర్ ని (అమీర్ చంద్) ఉమి చంద్ అనే ఒక వ్యాపారస్తుని చేత లంచం ఎరగా చూపించి లొంగదీసుకుంటాడు. సిరాజ్-ఉద్-దౌలా తర్వాత నవాబుగా నిన్నే చేస్తాం అని ఆశ చూపిస్తారు.
ఇది బెంగాల్ నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్ర, ఈ కుట్రలో మీర్ జాఫర్ తో పాటుగా రాయ్ దుర్లబ్, యార్ లుతుఫ్ ఖాన్, అమీర్ చంద్ అనే వారు కూడా ఉన్నారు.
ఇందులో అమీర్ చంద్ ఈ కుట్రకు సహకరించినందుకు తనకు మూడు లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు కానీ బ్రిటిష్ వారు అవి ఇవ్వకుండా మోసం చేస్తారు. తర్వాత అతనికి పిచ్చి పడుతుంది.
యుద్ధం జరిగే ముందే నవాబుకు మీర్ జాఫర్ తనకి ద్రోహం చేసే అవకాశం ఉంది అని తెలుసు. అందుకని తన తాలా పాగని మీర్ జాఫర్ ముందు విసిరేసి దానిని కాపాడటనికి సహకరించు అని కొడతాడు. కానీ మీర్ జాఫర్ ద్రోహి నవాబుకే కాకుండా మొత్తం భారతదేశాన్ని బంధికనాలో పెట్టే దిశగా అడుగులు వేశాడు.
ఫలితం:
1757 జూన్ 23 న యుద్ధం చివరి దశకు చేరింది అదే రోజు సాయంత్రం 4:35 గంటలు కల్ల నవాబు సేనలు పూర్తి స్థాయిలో ఓడించడం పూర్తయింది. ఏ సైన్యాన్ని అయితే నమ్మి వచ్చారో, ఆ సైన్యం తనాను వదిలి అవతలి పక్షాన చేరడంతో యుద్ధం ఒక పక్షం అయింది. ఒక్కా ద్రోహం గెలాచి జండా ఎగరేసింది.
ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం 27 మంది కోల్పోయింది. మరో 50 మంది గాయపడ్డారు.
నవాబు సైన్యం 500 మందిని కోల్పోయింధి దాదాపు 50,000 మంది సైనికులు, 40 ఫిరంగులు మరియు 10 యుద్ధ ఏనుగులతో కూడిన సిరాజ్-ఉద్-దౌలా సైన్యం కల్నల్ రాబర్ట్ క్లైవ్ యొక్క 3,000 మంది సైనికుల చేతిలో ఓడిపోయింది. యుద్ధం దాదాపు 11 గంటల్లో ముగిసింది.
ఓటమి తర్వాత సిరాజ్-ఉద్-దౌలా తన భార్యతో పారిపోతుండగా మీర్ జాఫర్ కొడుకు విరాన్ అనేవాడు పట్టుకుని చంపి వేస్తాడు. మీర్ జాఫర్ ను ప్రకటించి సింహాసనం పై కూర్చోబెడతారు. బంగారు రూపాయలతో నింపిన బల్లాన్ని బహుమతిగా ఇస్తారు దాని తర్వాత తనకు నష్ట పరిహారంగా రెండు కోట్లు 20 లక్షలు ఇవ్వాలి అని బ్రిటిష్ కోరుతుంది.
మీరు జాఫర్ నన్యాలు, సగలు రూపంలో వాటిని ఇస్తాడు. ఈ యుద్ధం తరువాత బ్రిటిష్ వారు బాగా బలపడతారు.
అప్పటివరకు వ్యాపారంలో కొనసాగిన వారి దోపిడీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగింది.
more content https://manacharitra.in






2 thoughts on “Battle of Plassey- ప్లాసీ యుద్ధం-1757”