First Battle of Panipat in Telugu – మొదటి పానిపట్ యుద్ధం – 1526

పరిచయం

First Battle of Panipat: మొగల్ సామ్రాజ్యనేత మవర్ కీ, సుల్తాన్ సామ్రాజ్యనేత ఇబ్రహీం లోడి కి మద్య జరిగిన యుద్ధం. 1526 ఏప్రిల్ 21న హర్యానాలోని పానిపట్ సమీపంలో జరిగిన మొదటి పానిపట్ యుద్ధం ప్రస్తుతం హరియానా రాష్ట్రంలో ఢిల్లీ కి ఉత్తరంగా 90 కి.మీ దూరంలోను దక్షణంగా చండీగర్ కి 169 కి.మీ దూరంలోను, 1వ నేషనల్ హైవె పైన ఉంటుంది ఈ పానిపట్. ఇక్కడ 1526, 1556, 1561 లో మూడు యుద్దాలు జరిగినవి. 1526 లో జరిగిన యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ యుద్ధం ద్వారా ఢిల్లీ సుల్తానేట్‌కు ముగింపు పలికి, మొఘల్ సామ్రాజ్యానికి నాంది పలికింది. మొగల్ సామ్రాజ్యానికి చెందినా బాబర్ కి, ఢిల్లీ సుల్తానేట్‌కు చెందినా లోడి Dynasty అంటే లోడి రాజ్యవంసపు రాజు, ఇబ్రహీం లోడి కి మద్య జరిగింది. చిన్న సైన్యంతో పెద్ద సైన్యాన్ని ఓడించిన వ్యూహం, గన్‌పౌడర్ ఆయుధాల వినియోగం, యుద్ధరంగంలోని క్రమశిక్షణ ఇవన్నీ కలిసి ఈ యుద్ధాన్ని చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

First Battle of Panipat in Telugu – మొదటి పానిపట్ యుద్ధం – 1526

ఈ యుద్ధంలో ప్రధాన పాత్రధారులు Babur మరియు ఢిల్లీ సుల్తాన్ Ibrahim Lodi.

ఇబ్రహీం లోడి క్రి.శ 1517 నుండి 1526 మద్య కాలంలో ఢిల్లీ సుల్తానేట్‌ని పాలిస్తాడు. ఇతను ఇరకుకు చెందినా పస్తాన్ అనే గ్రూప్ కు చెందినా వాడు పస్తాన్ అనేది వారి బాష విరు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లో జీవించేవారు.

బాహుల్ ఖాన్ లోడి అనే అతను అంతవరకు అధికారంలో ఉన్న సయ్యద్ లోడి Dynasty ని తోసివేసి, లోడి Dynasty ని స్తాపిస్తాడు. ఇతని కొడుకు సికిందర్ లోడి, సికిందర్ లోడి కొడుకు ఇబ్రహీం లోడి. క్రి.శ 1162 నుండి 1227 మధ్యకాలంలో జీవించిన చెంగిల్ ఖాన్, జపాన్ సముద్రం, ఉత్తర చైనా, రష్యా, యూరోప్ లోని స్పెయిన్ దాక, ఆసియా మైనుర్ అనే పిలువబడే ఇరాక్ దాక, భారత ఉప కాండంలోని ఆఫ్గనిస్తాన్ దాక బైయంకరమైన విద్వంసం సృష్టిస్తు మొగల్ సామ్రాజ్యాని ఏర్పాటు చేసాడు.

అతను దాడి చేసిన ప్రాంతంలో ఏది మిగాలనిచ్చెవాడు కాదు అణు బాంబ్ పడిన ప్రాంతంలా నిషేబ్దంగా మారిపోయేది. అల ఈ నేల పై క్రి.శ 1207 నుండి 1309 మద్య కాలంలో చెంగిస్ ఖాన్ కు చెందినా మంగోల్ వంశీయులు భూమి పై 16 శేతంన్ని, 110  మిలియన్ ప్రజలను అంటే ప్రపంచంలోని 25 శేతం మంది ప్రజలను పాలించారు. చెంగిస్ ఖాన్ మంగోలియలో ఒక ప్రాంతం నుండి వలస పోతు జీవించే కొండ ప్రాంతపు చిన్న తెగకు చెందినా వాడు. వీరిని స్టేఫియులు అనే వారు.

అంతటి బయనికమైన చక్రవర్తి చెంగిస్ ఖాన్ అలంటి చిన్న తెగ నాయకుడే, మద్య ఆసియా అంతటిని పాలించిన తిమూర్ డైనష్టిన్ లో బాబర్ తండ్రి గవర్నర్. బాబర్ చాల చిన్న వయస్సు నుండే యుద్దాలు చేసేవాడు. అల అతను ఉత్తర భారతము వైపు వచ్చాడు. అప్పటికి భారత్ లో ఢిల్లీ సుల్తానేట్ గా ఇబ్రహీం లోడి చాల శేక్తి వంతమైన రాజుగా పాలిస్తూ ఉండేవాడు. ఇంక్క మేవార్ రాజు రాణ సంఘ రాజపుద్ కన్ఫిడేసియులు పాలిస్తూ ఉండేవి. ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తానెట్ అరచికం జరుగుతూ పాలనా బలహీనంగా ఉన్నటుగా కనబడుతూ ఉండేది ఆ సమయంలో అంటే క్రి:శే 1726 లో ఇబ్రహీం లోడి పైకి యుద్దానికి బైలుదేరతాడు. బాబర్ ఈ విషయం తెలిసి ఇబ్రహీం లోడి తన సైన్యక అధికారి హవిద్ షేక్ అనే అతడిని సైన్యంతో బాబర్ ను అడ్డుకోవటానికి పంపిస్తాడు. బాబర్ హవిద్ షేక్ ను ఎదిరించటానికి తన కుమారుడు హుమయున్ ను పంపిస్తాడు. ఇతను ఫిబ్రవరి-25-1526 తేదిన హబాల ప్రాంతంలో హవిద్ ఖాన్ న్ని ఓడిస్తాడు.

ఈ గెలుపు తరవాత బాబర్ డిల్లి ని కైవసం చేసుకోవాలి అనే లక్షంలో బాగంగా తన సైన్యాని ముందుకు కదిలిస్తూ వచ్చి, షహబార్ మార్కండ అనే ప్రాంతంలో నిలుపుతాడు. షహబార్ మార్కండ అనే ఈ ప్రాంతం మర్కేండేయ మహర్షితో ఏర్పడింది.

హరియానా రాష్ట్రం కురుక్షేత్రం జిల్లా అంబాలాకు 22 కి.మీ ల దూరంలో ఇది ఉంది. ఈ ప్రాంతంలో బాబర్ సేనలు ఉన్నట్టు గుడచార్యులు ద్వార తెలుసుకున్న లోడి తన గవర్నర్ లో ఒక్కడైన దౌలాక్ ఖాన్ లోడిని పంపిస్తాడు.

దౌలాక్ ఖాన్ లోడి యుద్దానికి వస్తాడు అని తెలుసుకున్న బాబర్, కొంత సైన్యాని ఇచ్చి మెహింది క్వాజ అనే వాడిని ఎదురు దాడికి పంపిస్తాడు. ఈ యుద్దంలో మెహింది క్వాజ ఓడిపోతాడు. ఈ ఓటమిని బరించలేక బాబర్ తన సైన్యం అంతటిని తీసుకోని తనే స్వయంగా ఢిల్లీ పైకి దాడికి బైలుదేరతాడు. బాబర్ రాకను గ్రహించిన డిల్లి సుల్తాన్ ఇబ్రహీం లోడి పెద్ద సైన్యంతో పానిపట్ ప్రాంతంలో 21 ఏప్రిల్ 1526 లో యుద్దానికి వెళ్తాడు. ఈ యుద్దంలో బాబర్ వైపున 15 వేల మంది సైన్యకులు 20 నుండి 25 వ్వరకు ఫిరంగులు ఉన్నాయి అని ఒక్క అంచనా.           

రాజకీయ నేపథ్యం – ఢిల్లీ సుల్తానేట్ చివరి దశ

15వ శతాబ్దం చివర్లో ఢిల్లీ సుల్తానేట్ బలహీనపడింది. లోడి వంశానికి చెందిన ఇబ్రహీం లోడి (1517–1526) సింహాసనంపై ఉన్నప్పటికీ, అతని పాలనలో అంతర్గత అసంతృప్తి పెరిగింది.

సామంతులతో ఘర్షణలు, కఠిన నిర్ణయాలు, రాజదర్బారులో కుట్రలు, ప్రాంతీయ పాలకుల అసంతృప్తి

పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి వంటి కొందరు నాయకులు బాబర్‌ను భారత్‌పై దండయాత్ర చేయమని ఆహ్వానించినట్టు చరిత్ర చెబుతుంది.

ఇదే సమయంలో మధ్య ఆసియాలో ఫెర్గానా యువరాజు బాబర్, తిమూర్ వంశస్థుడిగా భారతదేశంపై హక్కు ఉందని భావించాడు. అతను కాబూల్‌ను స్వాధీనం చేసుకొని స్థిరపడిన తరువాత, ఢిల్లీ వైపు దృష్టి సారించాడు.

బాబర్ లక్ష్యం – భారతదేశంపై ఆధిపత్యం

బాబర్ కేవలం దోపిడీ యాత్రకే రాలేదు. అతని లక్ష్యం ఢిల్లీలో స్థిరమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. అతను 1519 నుండి 1524 వరకు పలు సార్లు పంజాబ్ వైపు దండయాత్రలు చేశాడు.

బాబర్ తన సైన్యాన్ని శిక్షణతో, క్రమశిక్షణతో తయారుచేశాడు. అతనికి ఒట్టోమన్ తుర్కీ శైలిలో తుపాకులు, ఫిరంగులు (కేనన్లు) ఉన్నాయి. ఆ కాలంలో భారతదేశ యుద్ధరంగంలో ఇవి కొత్త ఆయుధాలు.

యుద్ధానికి ముందు సైన్యాల శక్తి

  • ఇబ్రహీం లోడి సైన్యం

ఇబ్రహీం లోడి వైపున సుమారు 80,000–1,00,000 మంది సైనికులు, 1000కు పైగా యుద్ధ ఏనుగులు ఉన్నాయి అని ఒక అంచనా. భారి అశ్వికదళం సముద్రమంతా పాదసైన్యం ఉన్నప్పటికీ ఇబ్రహీం లోడి సైన్యం పురాతనమైన తమ సాంప్రదాయక ఆయుధాలనే వాడింది. పొడవాటి తల్వార్, గిరగిర తిప్పి విసిరే ఇనుప గోళాలు బరిసలు, బాణాలు మొదలైన వాటిని వాడింది. కానీ ఫిరంగులు ముందు తుపాకులు ముందు నిలువలేక అతి తొందరగా బలహీనం అయిపోయింది ఇబ్రహీం లోడి సైన్యం.

  • బాబర్ సైన్యం

బాబర్ ఈ యుద్దంలో ఫిరంగులను, తుపాకులను ఉపయేగించాడు. అతని విలు కాన్లు అత్యంత నిపుణులు కొత్తరకమైన బాణాలను సందించగలవారు. కత్తులు, బరిసెలు కూడా చాల కొత్తరకమైనవి. వాటిని ఉపయేగించేవారు కూడా కొత్త మేలుకవాలు తెలిసిన సైన్యుకులు.

సుమారు 12,000–15,000 మంది మాత్రమే. శిక్షణ పొందిన తుర్కీ సైనికులు తుపాకులు మరియు కేనన్లు (ఫిరంగులు) వ్యూహాత్మక నైపుణ్యం, సంఖ్యాపరంగా లోడికి పైచేయి ఉన్నా, వ్యూహం మరియు ఆయుధాలలో బాబర్ ముందుండేవాడు. బాబర్ వ్యూహం – తులుగ్మా & అరబా పద్ధతి, బాబర్ “తులుగ్మా” అనే తుర్కీ వ్యూహాన్ని ఉపయోగించాడు. ఇది రక్షణ కోసం బండ్లను ఉపయోగించే పద్దతి. సైన్యాన్ని కుడి, ఎడమ, మధ్య విభాగాలుగా విభజించాడు. శత్రువును చుట్టుముట్టేలా ప్రణాళిక వేసాడు. అదనంగా, అతను “అరబా” పద్ధతిని ఉపయోగించాడు. రథాలను వరుసగా కట్టి వాటి వెనుక తుపాకులను అమర్చాడు. రథాల మధ్య గ్యాప్‌ల ద్వారా సైనికులు దాడి చేసేలా ఏర్పాట్లు చేశాడు. ఈ విధానం లోడి సైన్యానికి కొత్తది.

యుద్ధ దినం – 21 ఏప్రిల్ 1526

ఉదయం పానిపట్ మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. లోడి సైన్యం భారీ సంఖ్యలో ముందుకు దూసుకొచ్చింది. ఏనుగులు ముందు వరుసలో ఉండడంతో భయానక దృశ్యం ఏర్పడింది.

బాబర్ సైన్యం తుపాకులతో దాడి ప్రారంభించింది. గన్‌పౌడర్ శబ్దం ఏనుగులను భయపెట్టింది. ఏనుగులు వెనక్కి తిరిగి తమ సైన్యాన్నే తొక్కేశాయి. లోడి సైన్యం గందరగోళానికి గురైంది.

ఈ సమయంలో బాబర్ తులుగ్మా వ్యూహాన్ని అమలు చేశాడు. అతని సైన్యం రెండు వైపులా చుట్టుముట్టింది.

కొన్ని గంటల తీవ్రమైన పోరాటం తరువాత, ఇబ్రహీం లోడి యుద్ధరంగంలోనే మరణించాడు. సుల్తాన్ మరణంతో సైన్యం విచ్ఛిన్నమైంది.

యుద్ధ ఫలితాలు?

1. మొఘల్ సామ్రాజ్య స్థాపన

బాబర్ ఢిల్లీ మరియు ఆగ్రాను స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్ పాలనకు ఇది ఆరంభం.

2. లోడి వంశానికి ముగింపు

లోడి వంశ పాలన ముగిసింది. ఢిల్లీ సుల్తానేట్ చరిత్ర ముగిసింది.

3. గన్‌పౌడర్ యుగం ప్రారంభం

ఈ యుద్ధం భారతదేశంలో తుపాకుల ప్రాముఖ్యతను చాటింది.

4. ఉత్తర భారత రాజకీయ మార్పు

ఒక కొత్త సామ్రాజ్యం ఏర్పడి భారతదేశ రాజకీయ దిశ మారింది.

బాబర్ పాలన ప్రారంభం

బాబర్ 1526–1530వరకు భారతదేశాన్ని పాలించాడు.

అతని పాలనలో ఎం జరిగింది?

  • శాంతి స్థాపన
  • తిరుగుబాట్ల అణచివేత
  • రాజధాని స్థిరీకరణ
  • అతని తరువాత హుమాయూన్, తరువాత అక్బర్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం బలపడింది.
  • చారిత్రక ప్రాముఖ్యత

మొదటి పానిపట్ యుద్ధంలో ఎం జరిగింది ?

  • ఒక సామ్రాజ్య పతనం
  • మరొక సామ్రాజ్య ఆరంభం
  • సైనిక వ్యూహంలో మార్పు
  • భారతదేశ రాజకీయ పునర్నిర్మాణం
  • ఈ యుద్ధం లేకపోతే మొఘల్ సామ్రాజ్యం స్థాపన సాధ్యంకాలేదని అనేక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
  • సామాజిక మరియు సాంస్కృతిక ప్రభావం

మొఘల్ పాలనతో ఎం జరిగింది?

  • పారసీ కళలు, సాహిత్యం అభివృద్ధి చెందాయి
  • నిర్మాణ కళ (తాజ్ మహల్ వంటి కట్టడాలకు పునాది) ఏర్పడింది
  • పరిపాలనా విధానాల్లో మార్పులు వచ్చాయి
  • ఈ మార్పుల మూలం 1526 యుద్ధమే.

ముగింపు

ఉదయం మొదలైన ఈ యుద్ధం యొక్క ఫలితం మద్యానం వరకే తెలిపోయింది చెంగిజ్ ఖాన్ వంశీయుడైన బాబర్ యుద్ధం తంత్రం అతని పాశవిక దాడి అనేక యుద్దాలు గెల్చిన అతని అనుబవం అన్నిటికన్నా అతని పిరంగులు, తుపాకుల గుల్లవర్షం ముందు ఇబ్రహీం లోడి సైన్యం చెల్లా చేదురైంది. దిక్కు తోచని దిశకు పారిపోయింది. వేలాది సైన్యం యుద్ద రంగంలో చనిపోయారు. సుల్తానేట్, ఇబ్రహీం లోడి కూడా అదే యుద్ద రంగంలో చనిపోయారు. అతని మరణంతో భారత్ లో సుల్తానుల వంశం పూర్తిగా అంతం అయిపోయింది. మొగల్ వంశ పాలనా ప్రారంబం అయింది బాబర్ అంటే టైగర్ అని అర్ధం. రక్తం రుచి మరిగిన ఆ టైగర్ దేశం పైన అడ్డంగా పంజా విసరటానికి బయలు దేరింది. ఇది మొట్ట మొదటి పానిపట్ యుద్ధం.

మొదటి పానిపట్ యుద్ధం కేవలం యుద్ధం కాదు – అది భారతదేశ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు. చిన్న సైన్యంతో పెద్ద సైన్యాన్ని ఓడించిన బాబర్ వ్యూహం ప్రపంచ చరిత్రలో కూడా ప్రస్తావించబడుతుంది.

1526 ఏప్రిల్ 21న పానిపట్ మైదానంలో జరిగిన ఈ సంఘటన భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చింది.

Battle of Buxar in Telugu-బక్సార్ యుద్ధం 1764

Battle of Plassey- ప్లాసీ యుద్ధం-1757

Leave a Comment